తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రవ అధికంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది.తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement