తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కేసులు పెరుగుదల కనిపిస్తోందన్నారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కి సంకేతం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని హెల్త్ డైరెకర్ట్ శ్రీనివాస్ చెప్పారు. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకం అని తెలిపారు. డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తిస్తోందన్నారు. కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందున్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం లక్షణాలు కనిపించడం లేదన్నారు. లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.