అమర్‌నాథ్‌లో నిన్న సంభవించిన క్లౌడ్ బ్రస్టింగ్తో ఒక్కసారిగా వరద పోటెత్తంది. ఈ అనుకోని ఘటనకు వేలాది మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక్కసారిగా వరద ముంచుకు రావడంతో పెద్ద ఎత్తున టెంట్లు, సామగ్రి కొట్టుకుపోయాయి. అయితే తెలంగాణకు చెందిన చాలామంది ఈ యాత్రకు వెళ్లిన వారిలో ఉన్నారు. వారంతా నిన్నటి ఘటనకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. తమ కండ్లముందే వరదలో వందలాది మంది కొట్టుకుపోవడం చూశామని, తాము ఓ ప్రదేశంలో సేఫ్‌గా ఉన్నామని వారు ఇవ్వాల ఫోన్లో తమ కుటుంబ సబ్యులు, రిలేటీవ్స్కి ఫోన్లో సమాచారం అందించారు.
జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో నిన్న సాయంత్రం భారీ వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయాయరు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో వేలాది మంది అక్కడే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు యాత్రికులు సైతం అమర్‌నాథ్ లో చిక్కుకుపోయారు. జనగామ జిల్లాకు చెందిన తాడూరి రమేశ్, సత్యనారాయణ, పల్లెల లక్ష్మీనరసయ్య, సిద్ధి లక్ష్మి దంపతులు అక్కడే ఉండిపోయారు.
ఈ నలుగురు ఈ నెల 3న ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి మరో ట్రైన్‌లో జమ్మూ వరకు వెళ్లారు. ఆ తర్వాత వాహనంలో పహిల్గామ్ వెళ్లి.. అక్కడి నుంచి కాలినడకన అమర్‌నాథ్ చేరుకున్నారు. కిలోమీటర్ దూరంలో ఉన్న సమయంలో వరద నీరు పోటెత్తడంతో ఆర్మీ ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తమ బంధువులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రంతా చిమ్మచీకట్లో భయం భయంగా గడిపినట్లు శనివారం ఫోన్ ద్వారా తెలిపారు.
అలాగే.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్‌గౌడ్, గడ్డం శ్రీనివాస్, మహేందర్‌తో పాటు మరో ఆరుగురు మిత్రులు కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. సాయంత్రం గుహ వద్ద జరిగిన వరద ప్రవాహానికి దగ్గరలోనే ఉన్నామని, తమ కళ్ల ఎదుటే ప్రమాదం జరిగిందని వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం భద్రతా బలగాలు తమను సురక్షిత ప్రాంతానికి తరలించాయని, తామంతా క్షేమంగానే ఉన్నట్లు సమాచారం ఇచ్చారు.