విదూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువు ఆలస్య రుసుం లేకుండా ఈనెల 18వ తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) జాయింట్ డైరెక్టర్ ఎం సోమిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరిం చారు. ఆలస్య రుసుం రూ.25తో ఈనెల 25వ తేదీ వరకు, రూ.50తో ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా మీసేవ, ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారానే ఫీజు చెల్లించాలని సూచించారు. డీడీలు, చలాన్ల ద్వారా ఫీజు చెల్లింపులను స్వీకరించబోమని పేర్కొన్నారు. మే లేదా జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
TS: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దూరవిద్య పది, ఇంటర్ ఫీజు గడువు పెంపు
Advertisement
తాజా వార్తలు
Advertisement