Tuesday, November 26, 2024

తెలంగాణ‌లో నో ఒమిక్రాన్ .. త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లే .. శ్రీనివాస‌రావు ..

తెలంగాణలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ కేసు ఒక‌టి కూడా న‌మోదు కాలేద‌ని ప్ర‌జారోగ్య‌శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు. త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నాని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. టిమ్స్ హాస్ప‌ట‌ల్ లో చేరిన వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు. జీనోమ్ రిపోర్టులు వచ్చాకే నిర్దారించుకోవాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కొందరు ఊహాగానాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మొద్దని కోరారు. కొవిడ్ సోకిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. అప్పుడే జీనోమ్ సీక్వెన్స్ తెలుస్తుంద‌ని తెలిపారు. అలాగే మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయని వెల్ల‌డించారు. బూస్టర్ డోస్ గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామన్నారు.

మరోవైపు చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నామన్నారు. ప్రతి నలుగురలో ఒక్కరికే వ్యాక్సిన్ అందిందని అందుకే కొత్త వేరియంట్ పుట్టుకొంచిందన్నారు. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్ విషయంపై వదంతులు నమ్మొద్దన్నారు. అలాంటి ప్రచారం చేసేవారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్ర‌జ‌లు మాస్క్ లతో పాటు ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement