Friday, November 22, 2024

PV Narasimha Rao: పీవీ మన ఠీవి.. ఢిల్లీలో ఘన నివాళి

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో పీవీకి రాష్ట్ర మంత్రులు, ఎంపీ లతో కలిసి, పీవీ చిత్ర పటానికి పూలు చల్లి, ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీలు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పీవీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సంరద్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశానికి ఆయన చేసిన సేవలను మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వ్యక్తి, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని అన్నారు. పీవీ మేధావి, బహుభాషావేత్త, కవి, రచయిత, అనువాదకుడు, ఆర్థిక వేత్త, అపర చాణక్యుడని కొనియాడారు. తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ దాత అని గుర్తు చేశారు. పీవీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. పీవీ వరంగల్ లోనే చదువుకున్నారన్న మంత్రి ఎర్రెబెల్లి.. రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించారని చెప్పారు. దేశ రక్షణ కొరకు అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టింది పీవీనేనని గుర్తు చేశారు. తన తండ్రి పీవీకి శిష్యుడుని అన్నారు. రాజకీయాల్లో తాను ఇంతగా ఎదగడానికి పీవీ గారే కారణమన్నారు. పీవీ స్ఫూర్తితో తాను రాజకీయాల్లో ఎదిగానని చెప్పారు. సీఎం కేసిఆర్ ఆశీస్సులతో మంత్రిగా ఉన్నాన్నారు. పీవీ సంస్కరణల స్ఫూర్తి తోనే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తెస్తున్నారని తెలిపారు. 2020 జూన్ 28 నుండి 2021 జూన్ 28 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. రాష్ట్రమే కాదు యావత్ దేశం, ప్రపంచంలోని 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించారన్నారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వoగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement