Tuesday, November 26, 2024

అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్ల వాసి.. తెలంగాణ మంత్రుల అభినందన..

అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన యువ నేతకారుడిని తెలంగాణ మంత్రులు కేటీ ఆర్, సబితారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ ఈ చీరను తయారు చేశారు. ఆ చీరకు సంబంధించిన వివ‌రాల‌న్నీ మంత్రులు అడిగి తెలుసుకున్నారు. విజ‌య్ పై ప్రశంస‌ల జ‌ల్లు కురుపించారు మంత్రి కేటీ ఆర్. కాగా, ఈ చీరను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అంద‌జేయడం విశేషం.

ఈ సందర్భంగా మంత్రి స‌బితా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న కార్యక్రమాల వ‌ల్ల చేనేత రంగంలో అనేక మార్పులు వ‌చ్చాయ‌న్నారు. విజ‌య్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అనంత‌రం విజ‌య్ మాట్లాడుతూ..  సిరిసిల్ల నేత కార్మికుల ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు మ‌ర‌లుతున్నార‌ని తెలిపారు. ఇప్పుడు తాను నేసిన చీర మూడు రోజుల్లో మ‌ర మ‌గ్గాలతో నేయ‌వ‌చ్చన్నారు. అయితే ఈ చీర‌ను చేతితో నేయాలంటే రెండు వారాలు ప‌డుతుంద‌ని విజ‌య్ చెప్పారు. నేత‌న్న నైపుణ్యాన్ని కొనియాడిన మంత్రులు.. ఆయ‌న భవిష్యత్తు ప్రయత్నాలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంద‌ని చెప్పారు. అయితే త‌న కొత్త యూనిట్ ప్రారంభోత్సవానికి రావాల‌ని మంత్రి కేటీఆర్ ను నేతకారుడు విజ‌య్ కోరారు. దీనికి మంత్రి సుముఖ‌త వ్యక్తం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement