కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం నిర్మల్‌కు రానున్నారు. తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో ఈరోజు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో బీజేపీ సభ నిర్వహించనుంది. శుక్రవారం అమిత్ షా నాందేడ్ నుంచి నిర్మల్ కు వెళ్లన్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో భీమన్న గుట్ట వద్దకు వస్తారు. నిర్మల్‌లో బ్రిటిష్, నిజాం సైన్యం వెయ్యి మంది గోండు వీరులను ఉరితీసిన మర్రిచెట్టు ప్రాంతాన్ని అమిత్‌షా సందర్శించి.. అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం ఎల్లపెల్లి క్రషర్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిర్మల్ సభను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. అమిత్ షా సభకు అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు హాజరుకానున్నారు. మరోవైపు నేడు గజ్వేల్ లో కాంగ్రెస్ సభ ఉండటంతో నిర్మల్ సభపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇది కూడా చదవండిః శశిథరూర్ కి రేవంత్ క్షమాపణ.. కాంగ్రెస్ ఎంపీ ఏమన్నారంటే..