Sunday, November 17, 2024

ఉప్ప‌ల్ లో ‘జెన్ ప్యాక్ట్’ విస్త‌ర‌ణ‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

ఉప్ప‌ల్ లో జెన్ ప్యాక్ట్ విస్త‌ర‌ణ‌కు శంకుస్థాప‌న చేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హైద‌రాబాద్ లో ల‌క్ష మంది ఐటీ ఉద్యోగులు ప‌ని చేసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌న్నారు. హైదరాబాద్ నలు దిక్కులా ఐటీని విస్తరింపజేస్తామని చెప్పారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష్యాన్ని చాలా సులువుగా చేరుకుంటామని ఆయన చెప్పారు. జెన్ ప్యాక్ట్ ను వరంగల్ కూ విస్తరిస్తున్నారని, అందుకు సంస్థకు ధన్యవాదాలని కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్ డెవలప్ మెంట్ కోసం నాగోల్ లో శిల్పారామాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడే ఉందన్నారు. పశ్చిమ హైదరాబాద్ కు దీటుగా తూర్పు ప్రాంతం అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు, ఉప్పల్ జంక్షన్ లో స్కైవాక్ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఐటీని విస్తరించేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ప్రైవేట్ డెవలపర్లకు తప్పకుండా మద్దతిస్తామని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement