Friday, November 22, 2024

KTR: టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశంలో మొదటిస్థానంలో ఉందని మంత్రి కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని పేర్కొన్నారు. రైతుబంధు ఉత్సవాలపై కేటీఆర్ మాట్లాడారు. సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు జరుగుతాయని తెలిపారు. రైతుబంధు ద్వారా కేసీఆర్ రూ. 50 వేల కోట్లు రైతులను ఆదుకుంది తెలిపారు.  ప్రతిపక్షాల వాళ్లు కూడా రైతుబంధు తీసుకుంటున్నారని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో రైతుకు ప్రభుత్వ మద్దతు లేదని కేటీఆర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో కరెంట్ కష్టాలు, విత్తనాలు, ఎరువులు కొనబోతే లాఠీఛార్జీలు ఉండేవన్నారు. నాడు వడ్డీ వ్యాపారులు రైతుల్ని పీక్కు తిన్నారని గుర్తు చేశారు.  గతంలో పాలమూరుతో పాటు ఇతర జిల్లాల రైతులు పట్నాలకు పోయి కూలీ చేసుకునే పరిస్థితి నుంచి మళ్లీ సొంత ఊళ్లకు తిరిగి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. పచ్చని పొలాలు, పంట భూములు, మత్తడి పారే చెరువులు కనిపిస్తాయని మంత్రి కేటీఆర్  అన్నారు. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. తెలంగాణలో ఎకరం రూ. 10-15 లక్షలకు తక్కువగా భూమి ధరలు లేవని చెప్పారు. తెలంగాణలో అతి తక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న కేసీఆర్.. గణనీయంగా ఆత్మహత్యలను తగ్గించామన్నారు. తెలంగాణ రైతులు పండించిన పంటను కేంద్రం కూడా కొనలేని స్థితికి వచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement