Monday, November 25, 2024

Water War: ఏపీ జలచౌర్యంపై తెలంగాణ సీరియస్‌.. ఆర్డీఎస్‌పై సీడబ్ల్యూసీకి కంప్లెయింట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్‌ డి ఎస్‌) రావణకాష్టంగా రగులుతూనే ఉంది. దశాబ్దాల పాటుగా అంతర్‌ రాష్ట్ర జల ప్రాజెక్టుగా అనేక సమస్యలకు కేంద్ర బిందువు గా మిగిలిందికానీ నీటి పంపకాల సమస్యలు పరిష్కారం కావడం లేదు. వివాదాల మధ్యపురుడు పోసు కున్న ఈ ప్రాజెక్టు నేటికీ సమాధానం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆంధ్ర ఏలుబడిలో ఉన్న ఆర్‌ డి ఎస్‌ ఆ రాష్ట్రం కుడికాలువ నిర్మించి నీటినితరలించుకు పోయేందుకు ప్రారంభించిన పనులు వేగం పుంజుకున్నాయే కానీ తెలంగాణ అభ్యంతరాలు అడ్డు కట్ట వేయలేక పోతున్నాయు. కృష్ణా నదీ యాజమానం బోర్డు ఫిర్యాదులు చేసినా నిర్మాణాలను ఆంధ్ర ప్రభుత్వం ఆపక పోవడంతో తాజాగా కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ కుడికాలువ నిర్మించి నీటిని తరలించుకుపోతే ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా రైతులు మరిన్ని సమస్యల్లో చిక్కునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆయకట్టు రైతాంగం ఆందోళనలకు సిద్ధమవు తున్నప్పటికీ ఈప్రా జెక్టుద్వారా ప్రయోజనం పొందుతున్న కర్నూలు జిల్లా రైతులు ప్రతిఘటించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే గతంలో ఆర్‌ డిఎస్‌ తూములను బాంబులతో పేల్చిన సంద ర్భాలు నేటికీ ప్రమాద సూచికలుగానే ఉండటంతో రాజ్యాంగబద్ధమైన కెఆర్‌ఎంబీ, సిడబ్లయూసీ, ట్రిబ్యునల్‌ జోక్యం చేసుకుంటే కానీ సమస్య పరిష్కా రం అయ్యే అవకాశాలున్నాయని జల నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

1944లో హైదరాబాద్‌ పాలకుడు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆర్డీఎస్‌ ప్రాజెక్టును తుంగభద్రా నదీపై డైవర్షన్‌ ప్రాజెక్టు నిర్మించి నాటి హైదరాబాద్‌ రాష్ట్రానికి నీటి సరఫరా చేయాలని నిజాం రాజు ప్రయత్నించినప్పుడు అంతరాష్ట్ర జలవివాదం తొలిసారిగా ముందుకు వచ్చింది. అప్పుడు మద్రాసు రాష్ట్రానికి హైదరాబాద్‌ సంస్థానికి మధ్య ఈ వివాదాన్ని బ్రిటిష్‌ అధికారులు పరిష్కరించి నీటి పంపకాల్లో స్పష్టత ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి అయున అనంతరం స్లూయుస్‌ మూసి వేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యి ంది. వడ్డెపల్లి దగ్గర రాజోలి దగ్గర తుంగభద్ర డైవర్షన్‌ స్కీం ప్రారంభించడంతో ఆపేరు సార్థకమైంది.

- Advertisement -

అనంతరం భాషాప్రతిపాదిపై రాష్ట్రాల పునర్‌ నిర్మాణాలు జరిగినప్పుడు మద్రాసు రాష్ట్రం లోకొంతభాగం ఆంప్రదేశ్‌ లో విలీనం కావడం, కొంతభాగం కర్ణాటకలో విలీనం కావడంతో కర్ణాటక,ఆంధ్రప్రదేశ్‌ ల మధ్య జల వివాదాలు రావడంతో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ 1 సమస్యను పరిష్క రించి ఆంధ్రప్రదేశ్‌కు 4 టిఎంసీ ఆంధధ్రప్రదేశ్‌ లో ఉన్న తెలంగాణ ఆయకట్టుకు 17 టిఎంసీలు నిర్ణయించి ప్రాజెక్టు తూములను మూసివేయాలనీ యాజమాన్యం బాద్యతలను కర్ణాటక తోపాటుగా ఆంద్రప్రదేశ్‌ కు అప్పగించింది . అసలు వివాదం ఇక్కడే ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పటికీ ఏపీ నీటిని తోడుకుని తెలంగాణకు మొండి చేయి చూపుతూ వస్తుంది. ఫలితంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్డీఎస్‌ ఒక అంశంగా మారింది.

రైతాంగ పోరాటాలు తప్పవు
తూములు పగలకొట్టి ఆర్డీఎస్‌ నీటిని కర్నూలు రైతులు తరలించుకు పోయినా శాంతి యుతంగా పరిష్కరించు కోవాలని తెలంగాణ రైతాంగం వేచి చూస్తుందని స్థానిక టీఆర్‌ ఎస్‌ నాయకుడు, రైతు సీతారాంరెడ్డి చెప్పారు. తెలంగాణ వాటాను సాధించడంతోపాటుగా ఆంధ్రప్రదేశ్‌ కుడికాలువ నిర్మించి నీటికి గండికొట్టాలని చూస్తున్న నేపథ్యంలో రైతాంగ పోరాటాలు అనివార్యం అవుతాయని ఆయన చెప్పారు.

ఎడారి కానున్ననడిగడ్డ
రాజోలిబండ డైవర్షన్‌ స్కీం నీటివాటాలను తేల్చ డంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈనీటిని అధికం గా తోడేందుకు నిర్మిస్తున్న కుడికాలువ పనులు నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. తెలం గాణ ఉద్య మంలో సైతం జలపోరాటాలు ఆర్డీఎస్‌ కేంద్రం గా ముందుకు సాగాయి. ఆనాటి ఉద్యమ నాయకుడు,నేటి సీఎం కేసీఆర్‌ 2004లో ఆర్డీఎస్‌ పరిరక్షణ కోసం పాద యాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పేరుకు మాత్రమే ఉన్న 17 టీఎంసీలు ఏరోజు నడిగడ్డలో పారలేదు. 85 వేల ఎకరాలకు నీరు రావల్సి ఉండగా కేవలం నడిగడ్డ (జోగులాంబ గద్వాల జిల్లా) 20 నుంచి 25 ఎకరాలకు సరిపెట్టు కోవల్సి వస్తుంది.ఆర్డీఎస్‌ పరివాహక ప్రాంతం అధికంగా తెలంగాణలో ఉండటంతో నీటి పంపకాలు కూడా ఆమేరకు ఉండాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుంది.

తెలంగాణ అభ్యంతరాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఆంధ్ర తెలంగాణ నీటి వాటాలు తేల్చుకోవల్సిఉండగా ఆంధ్రప్రదేశ్‌ నీటి వాటాలు తేల్చుకోకుండానే కుడి కాలువ నిర్మించి ఆర్డీఎస్‌ నుంచి భారీగా నీటిని తరలించేందుకు పనులను ప్రారంభించింది. తెలంగాణకు నీరు విడుదల చేయకుండానే దిగువ ప్రాంతంలోని కుడికాలువకు నీటిని భారిగా విడుదల చేసేందుకు ప్రణాళిక రచించి అమల్లో పెట్టింది. వరదల కాలంలో కేవలం నాలుగు టీఎంసీలను తరలించుకుపోయే హక్కున్న ఏపీ ఏకంగా ఆర్డీఎస్‌ నుంచి సుమారు 80 టిఎంసీల నికర జలాలను తరలించే సామర్థ్యం ఉన్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంల నిర్మాణాలు చేపట్టింది. పనులు దాదాపుగా పూర్తి కావ స్తున్నాయి. పోస్కీ, కడువూరుతో పాటుగా మరో నాలుగు ఎత్తి పోతల పథకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణా లను నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ కి ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోవడంతో సెంట్రల్‌ వాటర్‌ కమి షన్‌ కు ఫిర్యాదు చేసేందుకు నివేదికలను రూపొందిస్తుంది. ప్రస్తుత మునుగోడు ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ అంశంపై దృష్టి సారించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement