Thursday, November 21, 2024

కరెంట్ సప్లయ్ లో తెలంగాణ నెంబర్ వన్..

ప్ర‌భ‌న్యూస్: ఉమ్మడి రాష్ట్రంలో ‘పవర్‌’ కోసం రైతులు, ప్రజలు నిత్యం ధర్నాలు రాస్తారోకోలు.. విద్యుత్‌ కార్యాలయాల ముట్టడి వంటి వాటితో రాష్ట్రం అట్టుడికేది. ప్రజలు, పరిశ్రమలు, కార్మికులు, కర్షకులు… ఉద్యమాలతో ప్రజాప్రతినిధులు, అధికారులను కోతలపై నిలదీయడం నిత్యకృత్యంగా దర్శనమిచ్చేది. నిరంతరం విద్యుత్‌ కోతలు.. వారానికి మూడు రోజుల ‘పవర్‌ హాలీడే’లు రాష్ట్ర ప్రజలను కంటిమీద కునుకులేకుండా వేధించే రోజులవి. అటువంటి సంక్లిష్ట సమయంలో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భవించింది. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేలా దార్షనికతతో నాకు అతిపెద్ద బాధ్యతను అప్పగించారు అని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. నాటి పరిస్థితులను, విద్యుత్‌ రంగంలో నెలకొన్న సందిగ్ధతలను ఆంధ్రప్రభకు వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల్లోనే 24 గంటల నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నది దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. చిరుప్రాయంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ను పంపిణీ చేస్తున్నది. విప్లవాత్మక 24 గంటల విద్యుత్‌ అందజేత ఈ ఏడాది నవంబర్‌ 20కి ఏడేళ్ల విజయాత్రను పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నది. పెరిగిన వినియోగానికి అనుగుణంగా దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. వ్యవసాయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. ఇది తెలంగాణ వెలుగులకు దారితీసింది. ఈ కృషి వెనుక ఇద్దరు సీఎండీలైన రఘుమారెడ్డి, ప్రభాకర్‌రావుల కృషి వెలకట్టలేనిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement