Friday, November 15, 2024

కేసీఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలం.. మంత్రి గంగుల

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శాసనమండలి చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు సన్మాన సభలో మాట్లాడుతూ.. సమైక్య పాలనలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు.

సమైక్య పాలనలో రైతాంగం సాగునీరు, కరెంటు లేక అల్లాడారని, కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కూడా దక్కని పరిస్థితులు ఉండేవన్నారు. తెలంగాణలో రైతుబంధు ద్వారా రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతాంగానికి పంట పెట్టుబడితో పాటు మద్దతు ధర అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ కు ఎంతో ఇష్టమని, రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement