తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… దేశం చూపు తెలంగాణ వైపు ఉందన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ నాయకత్వం వైపు ఉందన్నారు. రోజుకు మూడు డ్రెస్ లు మార్చడం కాదు.. అనుకున్న లక్ష్యం ప్రకారం పనిచేయాలన్నారు. అన్ని వర్గాల వారి కలలు తెలంగాణలో నెరవేరుతున్నాయన్నారు. ప్రతిపక్షాల కలలు కల్లలవుతున్నాయన్నారు.
ఏ వర్గాన్ని విస్మరించకుండా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ దేశంలోనే టాకింగ్ పాయింట్ అన్నారు. దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ సలామ్ అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. 65లక్షల మంది రైతులకు రూ.65వేల కోట్లు జమ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అంటే నచ్చని నేత లేడు.. మెచ్చని ఆర్థిక వేత్త లేడన్నారు.