Tuesday, November 26, 2024

Breaking: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇందరారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. కాగా, బాలిక‌లు 68.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మేడ్చల్ జిల్లా ఫస్ట్ లో ఉండగా… సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లాకు తొలిస్థానం దక్కింది. అయితే మంత్రి సబితా మాట్లాడుతూ… ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడొద్దన్నారు. మళ్లీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement