తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హాల్ టికెట్లు కూడా ఇచ్చామని, జంబ్లింగ్ కూడా అయిపోందన్నారు. మే 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మరో 20 రోజుల సమయం ఉన్నందున అన్ని పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1771 సెంటర్లు ఉన్నాయని, అదనంగా 400 సెంటర్ల ఏర్పాటు చేశామని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి 8.50 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని జలీల్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement