తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలంటూ దాఖలైన పిటిషన్ పై నేడు రాష్ట్ర హైకోర్టు విచారణ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్యాండమిక్, ఎపిడెమిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఇష్టానుసారంగా ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ కోరారు. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేయనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..