Friday, November 22, 2024

Breaking: కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది.

కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించారు. దీంతో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులపై విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది.

మరోవైపు హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ జరగనున్నాయి. ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనుంది. కొవిడ్‌ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్‌ విచారణలు జరపనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement