డ్రగ్స్ కేసు దర్యాప్తు కేంద్ర సంస్థలకు ఇవ్వాలన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిల్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. 2016లో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలు సీబీఐ, ఈడీకి ఇవ్వట్లేదని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసుల వివరాలు ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు, వాంగ్మూలాలు ఇచ్చేలా ఎక్సైజ్‌శాఖను ఆదేశించాలని ఈడీ కోరింది. ఈడీకి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్ తో సంబంధాలున్న వారిని దాచి పెట్టాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డ్రగ్స్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
డ్రగ్స్ తో సంబంధాలున్న వారిని దాచి పెట్టాల్సిన అవసరమేంటి?: హైకోర్టు
By mahesh kumar
- Tags
- congress mp raventh reddy
- drug case
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- telangana high court
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement