తెలంగాణలోని కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన జీవో 317పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో 317పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
371డిని పార్లమెంట్‌లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 317 జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నిరాకరించారు. ప్రతివాదుల వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..