Wednesday, November 20, 2024

గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‎సాగర్‎లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని తెలిపింది. హుస్సేన్ సాగర్‎లో ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించింది. హుస్సేన్ సాగర్‎లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని, లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు సూచించింది.

ఇది కూడా చదవండి: థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై ప్రణాళిక సిద్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement