యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కాగా అంతకు ముందు నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని కోర్టుకు పిటిషనర్ పేర్కొన్నారు. దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తిస్తుందన్న ఏజీ ప్రసాద్ నిబంధనలు ఖరారు చేసినట్లు వివరించారు. నిబంధనలకు సంబంధించిన జీవో వెబ్ సైట్‌లో లేదని న్యాయవాది శశికిరణ్ వివరించారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటన్న హైకోర్టు.. ఏజీ వివరణ నమోదు చేసి వాసాలమర్రిలో దళిత బంధుపై విచారణ ముగించింది. జీవోలన్నీ 24 గంటల్లో వెబ్ సైట్‌లో పొందుపరచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో ఈనెల 20న మొహర్రం సెలవు