Saturday, November 23, 2024

గణేష్ నిమజ్జనం: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హుస్సేన్‌ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై గతంలో ఇచ్చిన తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం ఇచ్చిన హైకోర్టు తీర్పుపై జీహెచ్‌ఎంసీ అధికారులు రివ్యూ పిటిషన్‌ వేశారు. ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. తీర్పును సవరించేందుకు నిరాకరించిన హైకోర్టు… నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే.. ఉత్తర్వులను ఛాలెంజ్ చేయాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి: సైదాబాద్ ఘటన: ప్రభుత్వ తీరుపై రేవంత్ ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement