తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ పెడతారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. ప్రస్తుతానికి లాక్‌డౌన్. నైట్ కర్ఫ్యూ ప్రపోజల్ లేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని.. విద్యార్థుల ద్వారా ఇంట్లోని వారికి కరోనా సోకే అవకాశం ఉందన్నారు. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల చూస్తే సెకండ్ వేవ్ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. గతేడాది ఏ చర్యలు చేపట్టామో, అవే మళ్లీ మొదలయ్యాయన్నారు. కరోనాపై పోరుకు ప్రజలు సహకరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement