Friday, November 22, 2024

రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఇక ఆందోళన చెందొద్దు

రైతులకు తెలంగాణ శుభవార్త అందించింది. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతేడాది మాదిరిగానే ఈ వానకాలంలోనూ మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. సోమవారం ప్రగతిభవన్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న.. మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గత సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల 545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, యధావిధిగా ఈ ఏడాది కూడా ఆ కేంద్రాలన్నింటి ద్వారా ధాన్యం సేకరణ జరపాలని సీఎం పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని శుభ్రపరిచి తేమ, తాలు లేకుండా ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొనిరావాలని రైతులకు సూచించారు. మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: దళిత బంధుకు రూ.250 కోట్లు.. మరో నాలుగు మండలాల్లో అమలు

Advertisement

తాజా వార్తలు

Advertisement