Saturday, November 23, 2024

Sero Survey: తెలంగాణలో నేటి నుంచి సీరో సర్వే

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మరోసారి సీరో సర్వే చేయనున్నారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. రక్తంలో యాంటీబాడీల అభివృద్ధిపై అధ్యయనం కోసం నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ప్రతి జిల్లాలోని 10 గ్రామాల చొప్పున ఎంపిక చేసి సర్వే చేస్తారు. మొత్తం 33 జిల్లాల్లో ఉన్న 330 గ్రామాల్లో ఇంటింటికి సర్వే నిర్వహించనున్నారు. 16వేల మంది నమూనాలతో అధ్యయనం చేస్తారు. వైరస్‌ని ఎదుర్కొనేందుకు జనంలో ఎంత మేరకు నిరోధకత పెరిగిందనే అంశం ఈ సర్వేలో తెలుస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement