తెలంగాణలో కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఈ నెల 10 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రజా రవాణా వ్యవస్థలతో పాటు దుకాణాలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్, కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కు చేరింది. ఇందులో 27 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఈ ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 2 వరకు కోవిడ్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇటీవలే తెలంగాణ ప్రభత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడం వంటి ముప్పుతో ఈ నెల 10 వరకు ఆంక్షలను పొడిగించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital