ఎస్సీలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా హాస్పిటల్లో పోషకాహారం అందించే ఏజెన్సీలకు దీనిని వర్తింపజేసింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు.. మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశనంలో నూతన పాలసీని రూపొందించింది. ఈ మేరకు తాజాగా G.O 32 ను విడుదల చేసింది. 16% ఏజెన్సీలను ఎస్సీలకు కేటాయించాలని ఆదేశించింది. గరిష్ఠంగా 500 పడకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానలకు రిజర్వేషన్ వర్తింపజేసింది. ఇందుకోసం హాస్పిటళ్లను రెండు కేటగిరీలుగా విభజించింది. 100 వరకు బెడ్లు ఉన్న హాస్పిటల్ లను A కేటగిరి గా, 500 వరకు బెడ్లు ఉన్న హాస్పిటల్ లను B కేటగిరిగా నిర్ధారించింది. A హాస్పిటల్లో రిజర్వేషన్ కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారించాలి. కనీస టర్నోవర్ ను 50% తగ్గించాలి. రిజర్వుడ్ హాస్పిటల్ కు ఒక్క బిడ్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఒక్కటి రాకపోతే మరోసారి టెండర్ ఆహ్వానించాలి. అప్పుడు కూడా బిడ్లు రాకపోతే ఓపెన్ టెండర్లు పిలువాలి.
ఎస్సీలకు మరో గుడ్ న్యూస.. హాస్పిటల్లోని ఏజెన్సీలకు రిజర్వేషన్ వర్తింపు
Advertisement
తాజా వార్తలు
Advertisement