Friday, November 22, 2024

ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై గవర్నర్ సీరియస్‌.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

తెలంగాణలో సంచలనం రేపిన ఖమ్మం, కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్య ఘటనలపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఈ రెండు ఘటనలపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సామినేని సాయి గణేశ్, కామారెడ్డి జిల్లాలో తల్లీకుమారుల ఆత్మహత్యల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు ఈ ఘటనలపై మీడియా, సోషల్ మీడియాలలో వచ్చిన కథనాలను సమర్పించి చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రం ఇచ్చారు. 

దీనిపై స్పందించిన గవర్నర్.. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలు పీజీ సీట్లను బ్లాక్ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనా నివేదిక ఇవ్వాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని ఆదేశించారు. వీటితో పాటు యాదాద్రి-భువనగిరి జిల్లాలో రామకృష్ణగౌడ్‌ పరువు హత్య, కోదాడలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement