Saturday, November 23, 2024

తెలంగాణలో ఈనెల 15 వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌కు బ్రేక్

తెలంగాణ‌లో వ్యాక్సిన్ కొర‌త తీవ్రంగా ఉంది. క‌రోనా సెకండ్ వేవ్ తో జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతుండ‌టంతో వ్యాక్సిన్ కోసం జ‌నం క్యూ క‌డుతున్నారు. ప్ర‌భుత్వం 45సంవ‌త్స‌రాల పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ ఇస్తున్నా కేంద్రం నుండి వ‌స్తున్న డోసులు స‌రిపోవ‌టం లేదు. దీంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకునే వారికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన నేప‌థ్యంలో ఫ‌స్ట్ డోస్ తీసుకునే వారు కూడా పెరుగుతున్న ఈ స‌మ‌యంలో… సెకండ్ డోసు వారికి ప్రాధాన్య‌త ఇస్తూ, ఫ‌స్ట్ డోసును తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. సెకండ్ డోసు వారికి స‌మ‌యం మించిపోకుండా ఉండాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సెకండ్ డోసు తీసుకోవాల్సిన వారు 11ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 15వ‌ర‌కు ఫ‌స్ట్ డోసును ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే వ్యాక్సిన్ కొర‌త నేప‌థ్యంలో కేంద్రం ఇప్ప‌టికే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సినేష‌న్ ను ఎక్క‌డా నిలుపుద‌ల చేయ‌వ‌ద్ద‌ని… రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యాక్సిన్ల‌ల‌లో 70శాతం సెకండ్ డోసు వారికి, 30శాతం ఫ‌స్ట్ డోసు వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. తెలంగాణ‌లో మాత్రం కొంత‌కాలం ఫ‌స్ట్ డోసు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement