Tuesday, November 26, 2024

తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు?!

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తోంది. పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ను మే 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావులు సైతం చెప్పారు. లాక్ డౌన్ సత్పఫలితాలు కూడా ఇస్తున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో లాక్ డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

కరోనా కట్టడికి పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. అక్కడి లాక్ డౌన్ సత్పఫలితాలు ఇస్తున్నాయి. రోజువారి కేసులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ నిబంధలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కఠినం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ కూడా మహారాష్ట్రనే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు. మినహాయింపుల సమయాన్ని సద్వినియోగం పరుచుకునే యత్నం చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దాదాపు తెలంగాణలోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ వాటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం బుధవారం(మే12) నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ప్రజలు బయట రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు మినహాయించారు. ఆ తర్వాత పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా లాక్ డౌన్ అమలు అవుతోంది.

ఇది కూడా చదవండి: అంబులెన్స్ డ్రైవర్లుగా మారిన తహసీల్దార్, గ్రామ వాలంటీర్

Advertisement

తాజా వార్తలు

Advertisement