Saturday, November 23, 2024

తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు?

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సమస్యలపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఆరేళ్లుగా ఛార్జీలను సవరించలేదని… విద్యుత్ శాఖను గట్టెక్కించడానికి ఇప్పుడు పెంచక తప్పదని చెప్పారు. ఆర్టీసీతోపాటు విద్యుత్ అంశాలకు సంబంధించి… వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  ఛార్జీల పెంపు కోసం సమగ్ర ప్రతిపాదనల్ని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ వారిని ఆదేశించారు. ఆ ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని విద్యుత్‌ శాఖ మంత్రి, సంబంధిత అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement