Monday, November 18, 2024

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement