తెలంగాణలోని పాఠశాల విద్యాశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇవ్వాల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువరించగా.. భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. లేటెస్ట్గా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
24 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ 1 ఉద్యోగాలకు అనుమతి లభించింది. డైట్లో 23 సీనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ, ఎస్సీఈఆర్టీలో 22 లెక్చరర్ పోస్టుల భర్తీకి, డైట్లో 65 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది.
ఇది చేతల ప్రభుత్వం అన్న హరీశ్‌రావు
ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దీనిపై ట్వీట్ చేశారు. ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారికి గుడ్‌న్యూస్ చెప్పారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు.