Saturday, November 23, 2024

హైకోర్టు సీరియస్..నైట్ కర్ఫ్యూ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో నైట్ కర్ఫ్యూను మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మే ఎనిమిదవ తారీకు వరకు నైట్ కర్ఫ్యూను పొడగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అంత ముందుకు తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్ అయింది. నైట్ కర్ఫ్యూ ఈరోజు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కర్ఫ్యూ నేటితో ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై నిన్న హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు వెల్లడిస్తామని ఏజీ కోర్టుకు తెలపడంతో విచారణను హైకోర్టు నేటికి వాయింది. వేసింది. అయితే నేడు కూడా తమ నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టుకు చెప్పకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తోంది.. తదుపరి చర్యలేంటని నిలదీసింది. 24 గంటల సమయంలో కూడా ఇంకా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ పై జీవో ఈ రోజుతో ముగుస్తుందని.. మరి రేపటి నుంచి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందని హైకోర్టు ప్రశ్నించింది. రేపు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని ఏజీ చెప్పారు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారని కోర్టుకు ఏజీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే  ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు హైకోర్టు 45 నిమిషాల సమయం ఇచ్చింది. ఈ సమయంలోనే చెప్పకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని కోర్టు వెల్లడించింది. అనంతరం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement