తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు పేర్కొంది.
కాగా, జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతి సెలవులని కలిపి ఈనెల 16 వరకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 17 నుంచి విద్యాసంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.