Tuesday, November 26, 2024

హుజురాబాద్ లో మరో పథకం.. గొర్రెల పంపిణీకి శ్రీకారం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజురాబాద్ నియోజకవర్గానికి మహార్ధశ పట్టింది. ఓవైపు కోట్లాది రూపాయాలతో అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం.. మరోవైపు కొత్త పథకాలను ప్రారంభించేందుకు హుజురాబాద్ నే వేదికగా చేసుకుంటోంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ లోనే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రటకించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభం కానుంది.  హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మార్కెట్ యార్దులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు పాల్గొనున్నారు.

రెండో విడతలో రాష్ట్రంలోని 3.81 లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇటీవల సీఎం కేసీఆర్ 6 వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పెరిగిన ధరలు, లబ్దిదారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గొర్రెల యూనిట్ ధర గతంలో 1.25 లక్షల రూపాయలు ఉండగా, దానిని 1.75 లక్షల రూపాయలకు పెంచేందుకు కూడా సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని 8,109 సొసైటీ లలో సభ్యులుగా ఉన్న 7,61, 898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మొదటి విడత లో 5 వేల కోట్ల రూపాయలను కేటాయించగా 4702.78 కోట్ల రూపాయల ఖర్చుతో 3,76, 223 యూనిట్ల గొర్రెలను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో గెలుపు ఈటలకు కష్టమేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement