Tuesday, November 19, 2024

Telangana – ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడి ఎంట్రీ..!

68 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు.!
రూపాయలు 2 వేల కోట్ల అక్రమ నగదు రవాణ.
హైకోర్టు ఎంట్రీ తో కొత్త మలుపు.!
త్వరలో తెలంగాణకు రానున్న ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్.!
కేసు సాక్షాల భద్రతపై పోలీసుల ప్రత్యేక శ్రద్ధ.!
భుజంగరావు తిరుపతన్న కు దక్కని బెయిల్.
ఈడి రంగంలోకి దిగితే మరింత మంది నేతలకు రిస్కే
.

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుందా.? ఈ కేసు వివరాలను ఈడి అధికారులు ఎప్పటికప్పుడు ఆరాతిస్తున్నారా.? త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణ కు ఈడి వచ్చే అవకాశం ఉందా.? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో ఈడి రాక ఖాయం అనే వాదన మొదలైంది.

తెలంగాణలోని గత రెండు అసెంబ్లీ ఎన్నికల లో బిఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధా కిషన్ రావు ఆయన బృందంలోని అనేకమంది పోలీస్ అధికారులు విచారణలో కుండ బద్దలు కొట్టడంతో పాటు ఈ వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల విచారణ పేరుతో ఈడి ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో గులాబీ నేతల్లో భయం మొదలైంది నిజంగా ఈడీ రంగంలోకి దిగితే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో నాడు బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలతో పాటు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలకాయలకు ఇబ్బందులు తప్పవనీ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఛార్జ్ షీట్ దాఖలు

ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చగా వీరిలో ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు శ్రవణ్ రావు పరారులో ఉన్నట్లు సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావు సస్పెండ్ అయిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ లో ఉన్నట్టు అందులో వివరించారు 69 మంది సాక్షుల వాంగ్మూలాలను అభియోగపత్రంలో నమోదు చేశారు వీరిలో గతంలో ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన పోలీస్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు వేలాది పేజీల్లో అభియోగాలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలు ఉండడంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మరో నిందితుని విచారించగా మరిన్ని ఆధారాలతో పూర్తి అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు తెలిపారు అయితే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ కేసులో ఈడి రాక ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు వేల కోట్ల నగదు రవాణ

ఈ కేసు విచారణలో నిందితులు చెప్పిన దానిని బట్టి 2018 ,2023 అసెంబ్లీ ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల నిధులు రవాణా అయ్యాయి ఈనాటి పరిస్థితులను బట్టి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెడుతున్న ఖర్చు రూపాయలు 60 కోట్ల వరకు ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే అందులో నాలుగో వంతు ప్రకారం లెక్కగట్టిన ఒక్క నియోజకవర్గంలో రూపాయలు 15 కోట్లు మొత్తాన్ని నిందితులు తమ వాహనాల్లో విరు రవాణా చేసి ఉండే అవకాశం ఉంది తెలంగాణలోని 119 స్థానల్లో తక్కువలో తక్కువగా 50 స్థానాల్లో అలా చేసిన ఒక ఎన్నికల్లో చేరవేసిన మొత్తం రూపాయలు 750 కోట్లు అయ్యి ఉంటుంది ఈ లెక్కన రెండు అసెంబ్లీ ఎన్నికల కలిపి రూపాయలు 1500 కు పైగా మొత్తం అక్రమంగా రవాణా అయింది అని భావించాలి దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు, ఉప ఎన్నికలతో కలిపి ఈ మొత్తం రూపాయలు రెండు వేల కోట్లకు చేరే అవకాశం ఉందానేది ఒక అంచనా మరి ఇంత పెద్ద మొత్తంలో నగదును సమకూర్చిందెవరు ?ఎక్కడి నుంచి ఈ వాహనాలు ఎక్కడికి ప్రయాణించాయి? ఆ నగదు అందుకున్నది ఎవరు? ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టింది ఎవరు? అనే అంశాలపై ఈడి దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఇదే జరిగితే నాడు అధికార పార్టీకి పండింగ్ చేసినా వ్యాపారవేత్తలు మద్దతుదారులు విచారణకు సిద్ధం కావాల్సిందనేది నిపుణులు చెబుతున్నారు..

హైకోర్టు ఎంట్రీ..

మరో వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షాత్తు హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ను ట్యాపింగ్ చేశారని ఫోన్ ఓ నిందితుడు ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి . ఈ నేపథ్యంలో హైకోర్టు సంచల నిర్ణయం తీసుకుంది పలు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది సుమోటో పిటిషన్ పై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ల ధర్మసనం విచారణ చేపట్టనుంది అందులో కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ తెలంగాణ డిజిపి హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఇంటలిజెంట్ ఆదనపు డీజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు ఏకంగా న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారనే విషయం బయటకు రావడంతో హైకోర్టు విచారణ కు దిగటంతో ఈ అంశంపై అన్ని ఆలోచించే విచారణకు దిగాలని ఈడి భావించే అవకాశాలు ఉన్నాయి..

త్వరలో కీలక సాక్షులు రాక.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ విదేశాలకు పరారు గాక వీరిని విలైనంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో సిఐడి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం కీలక నిందితులను వీలున్నంత త్వరగా తీసుకొచ్చి వారిని విచారణ చేపడితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఎవరన్నది స్పష్టంగా తేలనుంది..

బదిలీల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు

తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు చిన్న పెద్ద అధికారులు ఉన్నారు బదిలీల నేపథ్యంలో ఈ కేసు కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర సాక్షాల తాలూకు ఆధారాలను కాపాడేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది..

నో బెయిల్.!

ఫోన్ ట్యపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కేదురైంది అడిషనల్ ఎస్పీ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు నాంపల్లి కోర్టు కొట్టివేసింది రాజకీయ దురుదేశ్చంతోనే తమ క్లైంట్లను ను అరెస్టు చేశారని కేసులో సాక్షాదారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషన్ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు ఛార్జ్ షీట్ దాఖలు వేసినప్పటికీ వారిని ఇంకా విచారించాల్సి ఉందని పిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు నేపథ్యంలో ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement