Saturday, November 23, 2024

ట్రాఫిక్ చ‌లాన్ల రాయితీతో కాసుల వర్షం.. ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ. 112.98 కోట్లు ఆదాయం

ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీకి విశేష స్పందన వస్తోంది. హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ట్రాఫిక్ చ‌లాన్ల క్లియ‌రెన్స్ వేగ‌వంతంగా జ‌రుగుతోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి. మార్చి 1న నుంచి ఇప్పటివరకు 1.2 కోట్ల చ‌లాన్లను క్లియ‌ర్ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఖ‌జానాకు ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 112.98 కోట్లు జ‌మ అయ్యాయి. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 63 ల‌క్ష‌ల చ‌లాన్లు క్లియ‌రెన్స్ కాగా, రూ. 49.6 కోట్ల ఆదాయం వ‌చ్చింది. సైబ‌రాబాద్ ప‌రిధిలో 38 ల‌క్ష‌ల చ‌లాన్లు క్లియ‌రెన్స్ కాగా, రూ. 45.8 కోట్లు, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 16 ల‌క్ష‌ల చ‌లాన్లు క్లియ‌రెన్స్ కాగా, రూ. 15.3 కోట్లు జ‌మ అయ్యాయి.

మార్చి 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రాగా ఈనెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. టూవీలర్‌, త్రీవీలర్‌ వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, హెవీ మోటార్‌ వెహికిల్స్‌కు 50శాతం… తోపుడు బండ్లకు 80 శాతం, నోమాస్క్‌ కేసులకు 90 శాతం రాయితీ కల్పించారు. డిసెంబర్ 2021 వరకు 80లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయని తేల్చిన పోలీసులు.. పెండింగ్ చలాన్ క్లియరెన్స్ కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు. వన్ టైమ్ డిస్కౌంట్ పేరుతో పెట్టిన చలాన్ల క్లియరెన్స్‌కు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement