Tuesday, November 26, 2024

భూమిని కోల్పోతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి.. పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం

సీతారామ ఎత్తిపోతల పథకంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తన భూమిని కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం ఆయనకు పరిహారం చెల్లించనుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. అశ్వాపురం మండలంలో గోదావరి నది నుంచి నీటిని తోడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు జలాశయంలోకి మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ తవ్వకం కోసం కూసుమంచి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 924లో 4.35 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే, ఈ భూమి తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి చెందింది. ఈ భూమి ఆయనకు వారసత్వంగా సంక్రమించింది. అయితే, కాలువ నిర్మాణం కోసం డీజీపీ తన భూమిని కోల్పోతున్నారు. దీంతో ఆయనకు ప్రభుత్వం రూ. 90,18,250 పరిహారం చెల్లించనుంది. ఈ మేరకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. వారం రోజుల్లోనే ఆ మొత్తం డీజీపీ మహేందర్‌రెడ్డి ఖాతాలో జమ కానున్నాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement