తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉల్లంఘనలకు విధించిన చలాన్లు లేదా జరిమానాల ద్వారా 366.08 కోట్ల రూపాయలను సేకరించినట్లు సమాచార హక్కు (ఆర్‌టిఐ) ప్రశ్నలో వెల్లడైంది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 1, 2020 నుండి సెప్టెంబర్ 30, 2021 మధ్య మొత్తాన్ని సేకరించారు. ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 మధ్య పోలీసు శాఖ రూ. 208 కోట్ల జరిమానాలను వసూలు చేసింది. గత ఏడాది కోవిడ్-19 లాక్‌డౌన్‌ను సమయంలో అత్యధికంగా వసూలు అయ్యాయి.
ఏప్రిల్ 2021 నుండి సెప్టెంబర్ 2021 మధ్య అధికారులు 158.33 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇదే సమయంలో సైబరాబాద్ పోలీసు పరిధిలో అత్యధికంగా రూ.53.26 కోట్లు చలాన్లు వసూలు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.35 కోట్ల జరిమానా వసూలు చేసి రెండో స్థానంలో నిలిచారు. ట్రాఫిక్ పోలీసులకు అత్యల్పంగా జిల్లా జయశంకర్ భూపాలపల్లి నుంచి రూ.30.36 కోట్లు లభించింది. గత సంవత్సరం COVID-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత, పోలీసులు ట్రాఫిక్ అంక్షలు కఠినంగా అమలు చేశారు. సరైన కారణం లేకుండా వారి ఇళ్ల నుండి బయటికి వచ్చిన వ్యక్తుల వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో భారీగా జరిమానాలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్‌లలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధిస్తున్నట్లు తెలుస్తోంది.