Friday, November 22, 2024

నేడు జార్ఖండ్ కు కేసీఆర్.. సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా బిజీబిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జార్ఖండ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా జాతీయ స్థాయి నేతలతో భేటీలు అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులను ఆయన కలిశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు శుక్రవారం రాంచీలో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం కానున్నారు.

2020లో గాల్వాన్‌ ఘర్షణ తర్వాత తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గాల్వాన్‌ అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 19 మంది భారతీయ సైనికులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  ఈ నేపథ్యంలోనే నేడు ఆ పరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వనున్నారు. సీఎం సోరెన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్, సోరెన్‌ల తండ్రి శిభు సోరెన్‌లు సన్నిహిత మిత్రులని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జేఎంఎం పార్లమెంట్‌లోనూ, పార్లమెంటు వెలుపలా మద్దతిచ్చిందని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శిభు సోరెన్ బహిరంగ సభలకు కూడా హాజరయ్యారని గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement