తెలంగాణలో పండిన మొత్తం వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని ఫైట్ చేస్తున్న సీఎం కేసీఆర్ నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నిరసన దీక్ష చేపట్టారు. పంజాబ్ రాష్ట్రానికి ఒక న్యాయం, తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఢిల్లీ వేదికగా కుండబద్దలు కొట్టారు. 24 గంటల డెడ్‌లైన్‌తో కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో ఇవ్వాల (మంగళవారం) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు అంశాలను సీఎం కేసీ ఆర్ నేరుగా మీడియా ద్వారా తెలంగాణతో పాటు యావత్ దేశ ప్రజలకు తెలియజేయనున్నారు.. ఈ లింక్ క్లిక్ చేసి మీరూ సీఎం కేసీఆర్ ఏం చెబుతున్నారో లైవ్‌లో చూడండి..
Advertisement
తాజా వార్తలు
Advertisement