తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. శుక్రవారం సీఎం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవల్ని ఆయన పరిశీలించనున్నారు. కేసీఆర్ వెంట ఈ పర్యటనలో మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లనున్నారు.
మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని పరిశీలించిన విషయం తెలిసిందే. అక్కడ కరోనా చికిత్స పొందుతున్న బాధితులతో మట్లాడారు. వారికి భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంజీఎంను సందర్శించి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో ధైర్యం నింపనున్నారు. అంతేకాదు కరోనా బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్….#NTR30 పోస్టర్ రిలీజ్