Saturday, November 23, 2024

CM Kcr Flexi: మోడీ ఇలాఖా వారణాసిలో వెలిసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు

మొన్న మహారాష్ట్ర, నిన్న ఏపీ, నేడు యూపీ. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ పెరుగుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో వెలిశాయి. యూపీ ఎన్నికలు జరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పలువురు రాజకీయ నేతలతోపాటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఫోటోలో ఉన్నాయి. తెలంగాణ సాయి అనే వ్యక్తి ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి కోసం సీఎం కేసీఆర్ విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ లతో సమావేశం అయ్యి.. రాజకీయాలపై చర్చించారు. తమిళనాడులో తెలంగాణ రైతు, వ్యవసాయ అనుకూల పథకాలు అమలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో చేర్చాలని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజల డిమాండ్ తీర్మాణాలు చేశారు. రాయచూరు ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ పథకాలు రైతుబంధును ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో అమలు చేస్తున్న కేంద్రం.. మిషన్ భగీరధ పథకాన్ని జల్ శక్తి మిషన్ గా ప్రకటించింది. యూపీ, పంజాబ్ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాలలో భారీ మార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ నిపుణులకు, తలపండిన మేధావులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు అర్ధం కావడం లేదు. కేసీఆర్ ఎత్తులతో బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటున్నది. కేసీఆర్ ను ఎదుర్కోలేక తెలంగాణ మీద కక్ష్య సాధింపు చర్యలు, నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement