దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకే ముంబయి వచ్చినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. కాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో లోతైన చర్చ జరిగిందన్నారు. అనేక అంశాలపై సమాలోచనలు చేశామని తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో మరిన్ని చర్చలు జరుపుతామని చెప్పారు. ఇంకా అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, రెండు రాష్ట్రాలు అనేక అంశాల్లో కలిసి పనిచేయాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అన్నారు.
దేశంలోని రాజకీయ పరిస్థితులు చర్చించేందుకే ముంబయి వచ్చా – సీఎం కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement