హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్‌తో, పకడ్భందీ వ్యూహంతో కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ నేతల పని తీరుపై సమాచారం సేకరి స్తోంది. అధిష్టానం దూతలను రంగంలోకి దింపి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహి స్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్య క్రమాలు రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ ప్రక్రి య జరుగుతున్నట్లు పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాతి నిధ్యం వహిస్తున్న సీనియర్లు చెబుతున్నారు. అధినాయకత్వం ఆదేశాలతో పార్టీ యాక్టివిటీ-స్‌లో ఒక్కసారిగా స్పీడ్ పెంచింది రాష్ట్ర నాయకత్వం. అయితే మేమిచ్చిన యాక్టివిటీ- పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా? లేదా? అన్న వివరాలు కూడా ఎప్పటి కప్పుడు సేకరిస్తున్నారు. ఉత్తర భార తంలో ఇలాంటి ప్లాన్లనే అమలు చేసి సక్సెస్ అయిన బీజేపీ.. దక్షిణాదిన కూడా అదే ఫార్ములా ఉపయో గించి తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే ప్రజా గోస, బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది రోజులుగా 5వేల సమావేశాలు ఏర్పాటు- చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మొత్తంగా ఇదే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అగ్ర నేతలు 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహిం చాలని టార్గెట్ పెట్టారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో ముఖ్య నేతలతో పాటు- మండల స్థాయి నేతల వరకు పాల్గొనాలని ఆదేశించారు. సమావేశాల్లో పొల్గొనే నేతల కు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. తీరా పది రోజులుగా సమావేశాలు జరుగుతున్నా కొంతమంది నేతలు బయటకు రావ డంలేదన్న విష యాన్ని సీక్రెట్ సర్వేలో గుర్తించారు. కొంతమంది నాయకులు తమకు ఇచ్చిన కార్యాచరణ అమలు చేయడంలో సుముఖంగా లేరని సర్వేలో తేలింది. కనీసం పార్టీ కార్యాలయం నుండి వస్తున్న కాల్స్ ను కూడా అ-టె-ండ్ చేయ లదని గుర్తిం చారు. దీంతో ఇచ్చిన కార్యాక్రమాలను లైట్ తీసుకుంటు-న్న నేతలపై జాతీయ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లపై నిఘా
బీజేపీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లపై ఓ నజర్ వేయాలని నిర్ణ యించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగు తున్న ఈ సమా వేశాల్లో పాల్గొంటు-న్న నేతలెవరు? వారి సమా వేశాలకు ప్రజల నుండి వస్తున్న స్పందన ఏంటీ-? అన్న వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పా టు- చేసింది. ఈ వ్యవస్థ ద్వారా సీక్రెట్‌గా నేతల రిపోర్టు లను సేకరిస్తున్నారు. సమావేశాల నిర్వ హణ కోసం ఎంపిక చేసిన 700 మందికి పైగా నేతలు నిత్యం ఎక్క డక్కడికి వెళ్తున్నారు? వారి పనితీరు ఎలా ఉంది? అన్న దానిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసు కుంటు-న్నారు. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో వారికి ఎలాం టి పనులు అప్పజెప్పాలి? పనిచేయని వారి ని ఎలా దారికి తెచ్చుకోవాలి? అనే అంశంపైనా కసరత్తు చేస్తున్నారు.
టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో కలవరం
నేరుగా జాతీయ నాయకత్వమే వ్యక్తిగత రిపోర్టు లు సేకరిస్తుండటంతో నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతల్లో కొత్త కలవరం మొదలైంది. అప్రమత్తం అవు తున్న కొందరు నేతలు తమపై ఎలాంటి రిమార్క్ రాకుం డా జాగ్రత్త పడుతున్నారు. ఈ రిపోర్టులను సునీల్ బన్సాల్ ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన సూచనలు చేస్తుండటంతో తమపై ఎలాంటి రిపోర్టు రెడీ అవుతుం ది? మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా? పాజిటీ-వ్ రి పోర్టే వెళ్తుందా? అన్న అంశంపై ఆరాతీస్తున్నారు. వంద నుంచి రెండు వందల మంది హాజరయ్యే కార్నర్ మీటిం గ్‌లకు తామేం వెళ్తాం లే అనుకుని ఇప్పటి వరకు నిర్లక్ష్యం గా ఉన్న నేతలంతా ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు.
పనితీరు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తమపై జాతీయ నాయకత్వాని బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తే అసలుకే మోసం వస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు తమదైన శైలిలో అప్రమత్తం అవుతున్నారు. ఢిల్లీ స్థాయి నుండి వస్తున్న సమాచారంతో తమ పనితీరు మెరుగుపరు చుకునే పనిలో పడ్డారు. తమపై నెగిటివ్ రిమార్క్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపై కూడా వారంతా కసరత్తు చేస్తున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల ముగింపుకు మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండటంతో వీలైనన్ని ఎక్కువ సమావేశాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నా రు. ఆశావహులంతా పాజిటివ్ మార్కులు తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇప్పటిరవకు రాష్ట్ర నేతలపై వచ్చిన సీక్రెట్ రిపోర్టులపై కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకుంటు-ందా? కేవలం భయపెట్టడానికే దీనిని పరిమితం చేస్తుందా? అన్న అంశంపై ప్రస్తుతానికి సందిగ్ధం నెలకొంది.