Tuesday, November 26, 2024

తక్షణమే ధాన్యాన్ని కొనండి: తెలంగాణలో బీజేపీ నిరసనలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యద్ధం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళ‌నలకు పిలుపునిచ్చింది.  టీఆర్ఎస్ కు పోటీ బీజేపీ కూడా ఆందోళనకు సిద్ధమైంది. గురువారం తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌డ్లను కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గురువారం ఆందోళ‌నల‌కు బీజేపీ పిలుపునిచ్చింది.

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం దిగొచ్చేదాకా రైతుల పక్షాన పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. వానాకాలంలో పండించిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు సిద్ధమని కేంద్రం గత ఆగస్టులోనే లేఖ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ ఆ తప్పును కేంద్రంపై నెట్టే యత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: ఆన్ లైన్ లో సినిమా టికెట్లు: ఎగ్జిబిటర్ల సమ్మతమే!

Advertisement

తాజా వార్తలు

Advertisement