కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజులు ములాఖాత్ లో కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు బండిని పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ కార్యాలయంను పరిశీలించిన నేతలు.. సంజయ్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న దాడిలో గాయపడిన వారిని, జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను పరామర్శించారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలంటూ కరీంనగర్‌లో జాగరణ దీక్షకు పూనుకున్న సంజయ్‌ని పోలీసులు ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital