Friday, November 22, 2024

Telangana BJP – కిష‌న్ రెడ్డికి తొలి లిట్మ‌స్ టెస్ట్ రె’ఢీ’….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దాదాపు రెండు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనివిధంగా భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి ఈ ఏడాది పరీక్షా సమయం ఆసన్నమైంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన ద్విపాత్రాభినయం ఎలా పోషించాలో తెలియక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే ఎన్నికల సంవత్సరం.. అందులో బీసీ వర్గానికి చెందిన నేతను తప్పించడంతో ఎటూ పాలుపోని స్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడ్డాక అధ్యక్షుడి మార్పు జరిగిపోవడానికి కారణాలు ఏవైనా.. పార్టీ భవిష్యత్తు ఎలా చక్కదిద్దాలో, జిల్లాలు, నియోజకవర్గస్థాయి నాయకత్వాలను ఎలా ముందుకు నడిపించాలో.. ఇప్పటికిప్పుడు తెలియని పరీస్థితి నెలకొంది. అటు కేంద్రంలో కేబినెట్‌ మంత్రిగా, ఇటు రాష్ట్రంలో కీలక సమయంలో అధ్యక్షుడిగా సక్సెస్‌ కాగలడా..? అన్న ప్రశ్న పార్టీలోని మెజారిటీ నాయకుల్లో వినిపిస్తోంది.

ఈ నెల 8వ తేదీన వరంగల్‌ వేదికగా జరుగనున్న ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ ఎలా సక్సెస్‌ అవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి వేదికపైకి రప్పించగలుగుతారా? అన్న అనుమానాలను కొంతమంది క్రియాశీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి నియామకం ఉన్న పళంగా అమలులోకి వస్తుందని బీజేపీ హైకమాండ్‌ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఆయన ముందు ఉన్న లక్ష్యం ఎనిమిదో తేదీన ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడం. తన నియామకంపై పార్టీలో నేతలెవరికీ అసంతృప్తి లేదని అందర్నీ కలుపుకుని వెళ్తానని నిరూపించగలగడం. ఈ విషయంలో కిషన్‌ రెడ్డికి పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశాలు లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఇదే..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణకు రానున్నారు. వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్కు వస్తారు. 8వ తేదీన ఉదయం 9.45 గంటలకు ఆయన వారణాసి నుంచి హకీంపేట్‌ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటల కల్లా వరంగల్లో దిగుతారు. ఉదయం 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కాజీపేట వ్యాగన్‌ ఓవర్హాలింగ్‌ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత వరంగల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు వరంగల్‌ నుంచి తిరిగి హకీంపేటకు వెళతారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు.

- Advertisement -

వరంగల్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు-
ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు- చేస్తున్నారు. బండి సంజయ్‌ చీఫ్‌గా ఉన్నప్పుడే ఏర్పాట్లు- ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు. కిషన్‌ రెడ్డి బాధ్యతలు తీసుకుంటు-న్నారు. అయితే ఏర్పాట్లపై ఎలాంటి ప్రభావం పడకుండా.. జన సమీకరణ విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటు-న్నారు. బహిరంగసభను విజయవంతం చేయడానికి కిషన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ నేతలందరితో మాట్లాడుతున్నారు.

ప్రధాని సభకూ అందరూ హాజరవుతారా?
ప్రధాని సభకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలందరూ హాజరు కావడంపై సస్పెన్స్‌ నెలకొంది. రాజగోపాల్‌ రెడ్డికి ఎలాంటి పదవి ప్రకటించలేదు. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు-గా చెబుతున్నారు. బీజేప సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేదంటు-న్నారు. అలాగే మరికొందరు నేతలు కూడా బండి సంజయ్‌ ను మార్చడంపై అసంతృప్తితో ఉన్నారు. ఈటల రాజేందరే కాదని.. తాను కూడా ఉద్యమం చేశానని విజయశాంతి వాపోయారు. తెలంగామ కాంగ్రెస్‌ లో ప్రచార కమిటీ- చైర్మన్‌ పదవి వదులుకుని బీజేపీలోకి వచ్చినా ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వడం లేదు. ఈ అంశాలన్నీ ప్రతికూల పరిస్థితులను రేకెత్తిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement